‘బ్లడీ రోమియో’గా నాని స్టైలిష్ మేకోవర్.. రెట్రో లుక్‌తో అదరగొట్టిన నేచురల్ స్టార్ 

‘బ్లడీ రోమియో’గా నాని స్టైలిష్ మేకోవర్.. రెట్రో లుక్‌తో అదరగొట్టిన నేచురల్ స్టార్ 

రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ‘ది ప్యారడైజ్’ చిత్రంతో మాస్ అవతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఆడియన్స్ ముందుకొచ్చిన నాని.. తన నెక్స్ట్ మూవీ కోసం స్టైలిష్ మేకోవర్​గా రాబోతున్నాడు. నాని హీరోగా సుజీత్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో  ‘బ్లడీ రోమియో’ చిత్రాన్ని ఇప్పటికే ప్రకటించారు.  తాజాగా ఈ సినిమా కోసం నాని సరికొత్త రెట్రో లుక్‌‌‌‌‌‌‌‌లో కనిపించి అందర్నీ మెస్మరైజ్ చేశాడు.  హెయిర్  స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ రూపొందించిన ఈ మేకోవర్‌‌‌‌‌‌‌‌లో కర్లీ ముల్లెట్ హెయిర్‌‌‌‌‌‌‌‌స్టైల్, రఫ్ బియర్డ్, డార్క్ సన్‌‌‌‌‌‌‌‌గ్లాసెస్‌‌‌‌‌‌‌‌తో నాని అల్ట్రా-స్టైలిష్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తున్నాడు.  

దర్శకుడు సుజీత్ పర్యవేక్షణలో రూపొందిన ఈ లుక్‌‌‌‌‌‌‌‌లో పాత్రకు సంబంధించిన ప్రత్యేకమైన యాక్సెసరీస్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో నాని చెఫ్‌‌‌‌‌‌‌‌తో పాటు గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌గా రెండు విభిన్న కోణాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. డార్క్ హ్యూమర్, యాక్షన్ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌తో  రూపొందనున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన  టైటిల్ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ రాగా, నాని కొత్త అవతారం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. నాని హీరోగా నటిస్తున్న 34వ సినిమా ఇది.  హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే  వెల్లడించనున్నారు.